21 July 2010

కళ్లలోనా నువ్వు గుండెల్లోనా నువ్వు

పల్లవి:
కళ్లలోనా నువ్వు గుండెల్లోనా నువ్వు
ఎద నిండా నువ్వే ఉన్నావు... నా ఎద నిండా నువ్వే ఉన్నావు.
నా జ్ఞాపకాలలో నీ సంతకాల నేనే దాచుకుంటానే పదిలంగా (2)
కళ్లలోనా నువ్వు గుండెల్లోనా నువ్వు
ఎద నిండా నువ్వే ఉన్నావు... నా ఎద నిండా నువ్వే ఉన్నావు.

చరణం 1:
నిన్నటిదాకా నాదనుకుంటూ భ్రమలోనే ఉన్నా
లోకం తట్టి చెప్పేదాకా సత్యం కాదన్నా (2)
స్వప్నాలన్ని నావన్నా నిజమే వద్దాన్నా
నమ్మించొద్దని నేనన్నా లోకం తప్పన్నా.
కళ్లలోనా నువ్వు......

చరణం 2:
నువ్వేలేని ఆ రేపటిలో కాంతులు లేవన్నా
ఉదయపు కాంతులు ఉన్నా నేను కళ్లే మూసినా
ఈ జన్మకు నువు కాదంటే వచ్చే జన్మన్నా
అది కూడా నువు కాదంటే జన్మను వద్దన్నా

కళ్లలోనా నువ్వు..

No comments: