09 November 2010

ఉన్నన్నాళ్ళు హాయిగా ఉండాలంది జీవితం

ఉన్నన్నాళ్ళు హాయిగా ఉండాలంది జీవితం
సరదాగా చిందులు వేసేద్దాం
వెళ్ళిందంటే రాదుగా మళ్ళీ మళ్ళీ ఈ క్షణం
కాలంలో పాటే పరిగెడదాం
నేనింతే నా తీరింతే అంటూ కూర్చుంటే
నీ చుట్టూ వెలుగెంతున్నా నువ్వుండేది చీకట్లోనే
ఏ సరిహద్దుని నో ఇక వద్దని
ఓ చిరునవ్వుతో వెల్‌కమ్‌ చెప్పెయ్‌ ||ఉన్నన్నాళ్ళు||

అప్పుడప్పుడు చాలా చిన్న సంగతే
ఎంతో తృప్తి నివ్వదా నీలో నీకు
చూడగలిగితే ఎన్నో అధ్భుతాలని లోకం
చూపగలదని మరిచిపోకు
కోటల్లో కోరికలన్ని కొండెక్కే వీలివ్వద్దు ఎదురొచ్చే ఆనందాన్ని
వద్దొద్దంటూ ఆపెయ్యద్దు
ఈ బ్రతుకన్నది హే బహు చిన్నది
ఓ చిరునవ్వుతో స్వర్గం చేసెయ్
లా ల ల ల ల

కంటి చూపుతో కొంచెం పలకరించుతూ
ప్రేమే చిలకరించుతూ
ఆనందించు నోటి మాటతో బంధం కుదురుతుందని
భారం తగ్గుతుంది ఆలోచించు
హే నలుగురితో పాటే నేను అనుకోడం ఆరంభించు
సంతోషం రెక్కలు తొడిగి ఎగిరొస్తుంది ఆహ్వానించు
ఈ పదిమందిలో నీ పరదాలను
ఓ చిరునవ్వుతో మాయం చేసెయ్ ||ఉన్నన్నాళ్ళు||

No comments: