జామ చెట్టుకి జామ కాయలు
ఈత చెట్టుకి ఈత కాయలు
చింత చెట్టుకీ చింత కాయలు
మల్లె చెట్టుకీ..
"మల్లెకాయలా ?? రేయ్ రాంబాబు"
కాయలుండవు కాయలుండవు
పువ్వులుండునూ.. పువ్వులుండునూ..
"వా వా వా...క్యాబాత్ హై క్యాబాత్ హై .. "
"థ్యాంక్యూ.. థ్యాంక్యూ.. ఇంకోటొదల్నా.. "
"ఒకె ఒకె.. ఫర్మాయియే.. కొట్రా..."
రైలు ఎక్కితే రైలు టిక్కెట్టు
బస్సు ఎక్కితే బస్సు టిక్కెట్టు
ఫ్లైటు ఎక్కితే ఫ్లైటు టిక్కెట్టు
ఆటో ఎక్కితే.. ఆటో ఎక్కితే..
"ఆటో ఎక్కితే.. ఏందిరా భయ్..ఆటో టిక్కెట్టా.."
టికెట్టు లేదుగా టికెట్టు లేదుగా
మీటరుండును.. మీటరుండునూ..
"ఆటోకి మీటర్ ఉంది నీ పొయెట్రీకి మీటర్ లేదు మ్యాటర్ లేదు...
పొయెట్రీ అంటే మాటలు కాదు.. యతి ప్రాసా ఉండాలి.."
"ప్రాస అంటే.. "
"నేన్చెప్తా నేన్చెప్తా సింపులూ.. "
నువ్విజిలేస్తే అంధ్రా సోడాబుడ్డీ...
నీ అథరామృతం పుల్లా రెడ్డీ..
అదీ ప్రాసంటే..
ఓస్ అంతేనా ఐతే కాస్కో.. నువ్వేస్కో..
టాట్టా..టట్టాటటాట్టా.. టట టట టాట్టా..టట్టాట టాట్టా..
మా ఊళ్ళో మాకుందో మేడా..
మేడ చుట్టు ఉన్నాదో గోడా.. అబ్బా
గోడ పక్క నుంచుంది దూడా.. అరెరెరెరె..
దూడ చూడు వేసింది ’చీ..’...
పేడ పేడ పేడ...
"హె శభాష్ మీరంతా జీనియస్ లెహె..
ఈడియట్స్ మీరు మీ పెంట పొయెట్రీలు..
దీన్నే నేచురల్ ప్యూర్ ఆర్గానిక్ పొయెట్రీ అంటారు..
తెల్సా.. అరె ఏం జెప్పినవన్నా.. కరెక్ట్.. కంటిన్యూ.. "
టాట్టా..టట్టాటటాట్టా.. టట టట టాట్టా..టట్టాట టాట్టా..
వంటింట్లో ఉంటుంది చాకూ.. హమ్మో..
కరెంటు తీగా కొడుతుంది షాకూ.. ఆహా..
గోడ లోకి కొట్టేదీ మేకూ.. (గొంతు సవరణ)
వీపు మీద దురదొస్తే..ఉమ్మ్...
గోకు గోకు గోకు.. గోకు గోకు గోకు..
టాట్టా..టట్టాటటాట్టా.. టట టట టాట్టా..టట్టాట టాట్టా..
No comments:
Post a Comment