పల్లవి: నువ్వేమాయ చేశావోగాని ఓ మనసా చెప్పమ్మా నిజాన్ని
క్షణం ఆగనంటోంది బోణి మరీ చిలిపిదీ వయసు బాణీ
హయ్యా హయ్యారే హయ్యారే హయ్యా చిందులేస్తున్న ఈ అల్లరి
ఓ సయ్యా సయ్యారే సయ్యారే సయ్యా ఎటు పోతుందో ఏమో మరి
చరనం 1: ఔరా పంచకల్యాణి పైన వస్తాడంటా యువరాజు అవునా
నువ్వేమైనా చూశావా మైనా తెస్తున్నాడా ముత్యాల మేనా
హయ్యా హయ్యారే హయ్యారే హయ్యా మొగలి పువ్వంటి మొగుడెవ్వరే
ఓ సయ్యా సయ్యారే సయ్యారే సయ్యా మేళ తాళాల మనువెప్పుడే
చరనం 2: అలా నువ్వు ఏ చాటునున్నా అలా ఎంత కవ్వించుతున్నా
ఇలా నిన్ను వెంటాడి రానా ఎలాగైనా నిన్ను కలుసుకోనా
హయ్యా హయ్యారే హయ్యారే హయ్యా ఆశ పడుతున్న ఈ నా మది
ఓ సయ్యా సయ్యారే సయ్యారే సయ్యా అది తీరేది ఎప్పుడన్నది
No comments:
Post a Comment