22 June 2010

నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్హాను.....

||పల్లవి||
నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్హాను.....
నేను సైతం విశ్వవ్రుష్టికి అశ్రువొక్కటి ధారవోశాను....
నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుకనిచ్హి మ్రోశానూ..
నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్హాను.....

||చరణం 1||
అగ్నినేత్ర మహోగ్రజ్వాల దాచిన ఓ రుద్రుడా.....
అగ్ని శిఖలను గుండెలోన అణిచినా ఓ సూర్యుడా
పరశ్వథమును చేతబూనిన పరశురాముని అంశవా...
హింసనణచగ ధ్వంసరచనను చేసిన ఆజాదువా
మన్నెం వీరుడు రామరాజు ధనుష్టంకారానివా.....
భగత్ సింగ్ కడసారి పలికిన ఇంక్విలాబ్ శబ్దానివా......||నేను సైతం||

||చరణం 2||
అక్రమాలను కాలరాసిన ఉక్కుపాదం నీదిరా.....
లంచగొండుల గుండెలో నిదురించు సిం హం నీవురా
ధర్మ దేవత నీడలొ పయనించు యాత్రే నీదిరా.....
కనులు కప్పిన న్యాయదేవత కంటి చూపై నావురా
సత్యమేవజయతికి నిలువెత్తు సాక్ష్యం నీవురా.....
లక్షలాది ప్రజల ఆశాజ్యొతివై నిలిచావురా...... ||నేను సైతం||

No comments: