22 June 2010

వస్తాడు నా రాజు ఈ రోజు రానె వస్తాడు నెలరాజు ఈ రోజు

పల్లవి:

వస్తాడు నా రాజు ఈ రోజు రానె వస్తాడు నెలరాజు ఈ రోజు
కార్తీక పున్నమి వేళలోన కలికి వెన్నెల కెరటాలపైన
కార్తీక పున్నమి వేళలోన కలికి వెన్నెల కెరటాలపైన
తేలి వస్తాడు నా రాజు ఈ రోజు

చరనం 1:

వేలతారకల నయనాలతో నీలాకాశం తిలకించేను
వేలతారకల నయనాలతో నీలాకాశం తిలకించేను
అతని చల్లని అడుగుల సవ్వడి వీచే గాలి వినిపించేను
ఆతని పావన పాద ధూళికై అవని అణువణువు కలవరించేను
అతని రాకకై అంతరంగమే పాలసంద్రమై పరవశించేను
పాల సంద్రమై పరవశించేను

చరనం 2:

వెన్నెలలెంతగా విరిసినగాని చంద్రున్నీ విడిపోలేవు
కెరటాలెంతగా పొంగినగాని కడలిని విడిపోలేవు
కలసిన ఆత్మల అనుబంధాలు ఏ జన్మకూ విడి పోలేవులే
తనువులు వేరైనా దారులు వేరైనా
తనువులు వేరైనా దారులు వేరైనా
ఆ బంధాలే నిలిచేనులే
ఆ బంధాలే నిలిచేనులే

No comments: