చిగురులు వేసిన కలలన్ని సిగలో పూలుగ మారినవి
మనసున పొంగిన అలలన్ని మమతల తీరం చేరినవి మమతల తీరంచేరినవి
ఆ.ఆ.ఊఒ.ఊ
సన్నజాజి తీగలాగ నిన్ను చేరుకున్నను
సన్నజాజి తీగలాగ నిన్ను చేరుకున్నను
నిండు మనసు పందిరి కాగా నిన్ను అందుకున్నను నిన్నే అందుకున్నను
చిగురులు
దాగలేని రాగాలేవో దాచినావు ఆనాడు
దాగలేని రాగాలేవో దాచినావు ఆనాడు
నా తనువు అణువణువు నీదే నీదే ఈనాడు నీదే నీదే ఏనాడు
చిగురులు
నీటిలోని కలువను కోరి నింగి దిగిన జాబిలి నీవే
నీటిలోని కలువను కోరి నింగి దిగిన జాబిలి నీవే
పరిమళాల తరగలలోనె పరిమళాల తరగలలోనె కరిగించిన చెలియవు నీవే
చిగురులు
No comments:
Post a Comment