22 June 2010

మెరిసే మేఘమాలికా..ఉరుములు చాలు చాలిక

మెరిసే మేఘమాలికా..ఉరుములు చాలు చాలిక
చెలితో మాటలాదనీ..వలపే పాట్ పాడనీ వలపే పాట పాడనీ
మెరిసే మేఘమాలికా..ఉరుములు చాలు చాలిక

కమలాలే నా రమణి నయనాలై విరిసే
అద్దాలే నా చెలియ చెక్కిళ్ళై మెరిసే

ఆ నయనాల కమలాల లోనా..నా జిలుగు కలలు చూసుకోనీ
ఆ అద్దల చెక్కిళ్ళ లోనా.. నా ముద్దులే దాచుకోనీ

మెరిసే మేఘమాలికా..ఉరుములు చాలు చాలిక

మధుమాసం చెలి మోవిని దరహాసం చేసే
తెలి జాబిలి చెలి మోమున కళలారబోసే

ఆ దరహాస కిరణాలలోనా..నను కలకాలం కరిగిపోనీ
ఆ కళల పండు వెన్నెల లోన నా వలపులన్ని వెలిగి పోనీ

మెరిసే మేఘమాలికా..ఉరుములు చాలు చాలిక

No comments: