01 July 2010

గిల్ గిలన్నా గిల్ గిలన్నా గిల్..

గిల్ గిలన్నా గిల్ గిలన్నా గిల్..
గిల్ గిలన్నా గిల్ గిలన్నా గిర్ర్..ర్ర్..గిర్రన్నా...

హోయ్ కాలేజి బుల్లోడా.. కలేజ ఉన్నోడా..
స్టూడెంట్ కుర్రోడా.. టాలెంట్ ఉన్నోడా..
ఉన్నది ఎక్కువే రా ... లేనిది తక్కువేరా..
ఉన్నది ఎక్కువే రా ... లేనిది తక్కువేరా..
ఉన్నదంతా ఊడినా పుడింగు వేరా...
ఒరే నువ్ పుడింగువేరా..

||కాలేజి ||

చదువలన్ని మూలబెట్టి పుస్తకాలు మూట గట్టి
సిగరెట్టు చేత బట్టి చింపాంజీ ఫోజు బెట్టి...
రంకెలు వేస్తావు ర్యాగింగులు చేస్తావు..
రోతగ చూస్తావు బూతు జోకులేస్తావు..
రమేశా అరె రాధారమేశా...
నీ ఫ్యూచరు పంక్చరు అయిన రమేశా..
ఫ్యాను ఫాలోయింగు పెరుగుతాది రమేశో.. రమేశా..

||కాలేజీ||

అన్నా అన్నా అంటు నువ్వు అన్న వెనుక ఉంటావు
అన్న ఒక్క మాట చెబితె అన్ని కానిస్తావు..అన్నా..
బందులు చేస్తావు.. బస్సులు తగలేస్తావు..
కొట్లను మూస్తావు.. కొట్లాటకు లేస్తావు..
గణేశా..గుణ గణ గణేశా..
నీ ఎనర్జంత వేశ్టైనా గణేశా..
నీకు ఎక్స్పీరియన్స్ ఒస్తుంది గణేశో గణేశా..

||కాలేజీ||

మాదక ద్రవ్యాల లోనా మాష్టరు గా మారినావు
డోపింగ్ విభాగాన డాక్టరేటు పొందినావు
దగ్గే పెరిగేలా డ్రగ్స్ తీసుకున్నావు..
లివరు పోయేలా లిక్కరు లాగిస్తావు..
సురేశా.. హాయ్ సురేశా..
నీ హెల్తంతా ఖరాబైనా సురేశా..
స్వర్గం హైటెంతో తెలుస్తాది సురేశో..సురేశా..

||కాలేజీ||

గిల్ గిలన్నా గిల్ గిలన్నా గిల్ గిలన్నా గిల్..
గిల్ గిలన్నా గిల్ గిలన్నా గిర్ర్..ర్ర్..న గిర్రన్నా..

ఐఫోనూ చేతిలోన.. ఐపాడు చెవిలోనా..
కాలేమో బైకు పైన.. కళ్ళేమో ఆకాశాన..
ఒయ్ ఒయ్..ఒయ్ ఒయ్..
పార్టీలంటావు పబ్బుల్లో ఉంటావు..
ఫాల్సు ప్రిస్టేజి కి పాకులాడుతుంటావు
ప్రకాశా.. అరె లేరా.. ప్రకాశా..
నీ కన్నోళ్ళ కన్నీళ్ళను ప్రకాశా..
నీ పెర్ఫ్యూమ్ బాటిల్లో కలుపు ప్రకాశో పకాశా..

No comments: