01 July 2010

మంచితనం ఇంటిపేరు మొండితనం ఒంటిపేరు

మంచితనం ఇంటిపేరు మొండితనం ఒంటిపేరు
కొత్తదనం కొసరుపేరు తెలుగుదనం అసలుపేరు
ముక్కుసూటితనం మారుపేరు
ఆవేశం నాపేరు ఇక నన్నెవరు ఆపేరు
ఆత్మవిశ్వాసం నాపేరు ఇక నన్నెవరు ఆపేరు ||మంచితనం||

అన్యాయం పైదూకే సింహం నేనౌతా
అంధకారమును చీల్చే సూర్యుడు నేనౌతా
ఆకలంటు అన్నోళ్ళకి అన్నం నేనౌతా
ఆడపడుచులందరికి మరో అన్ననౌతా
మనిషి ఏనాడు రెండుసార్లు చావడు
మనిషి ఏనాడు రెండుసార్లు చావడు
చచ్చేలోగా ఏదో సాధించక తప్పదు
ఉత్తేజం నాపేరు ఇక నన్నెవరు ఆపేరు
ఉద్వేగం నాపేరు ఇక నన్నెవరు ఆపేరు ||మంచితనం||

కన్నీటిని తుడిచేందుకె ఉన్నది నాచేయి
కన్నతల్లి ఋణం తీర్చేందుకె ఉన్నది నాబ్రతుకు
కొందరికే అందుతోంది కూడు గుడ్డా గూడు
అందరికి పంచేందుకె వేస్తా నేముందడుగు
మడమే తిప్పనని పట్టాను దీక్ష
మడమే తిప్పనని పట్టాను దీక్ష
మనకందరి కుంటుంది రామయ్య రక్ష
నిస్వార్ధం నాపేరు ఇక నన్నెవరు ఆపేరు
నిజాయితీ నాపేరు ఇక నన్నెవరు ఆపేరు ||మంచితనం||

No comments: