20 July 2010

ముద్దుగారే యశోదా ముంగిట ముత్యమూ వీడు

ముద్దుగారే యశోదా ముంగిట ముత్యమూ వీడు ||3||
దిద్దరాని మహిమల దేవకీ సుతుడూ
ముద్దుగారే యశోదా ముంగిట ముత్యమూ వీడు

అంత నింత గొల్లెతల అర చేతి మాణిక్యమూ ||2||
పంత మాడె కంసుని పాలి వజ్రమూ
కాంతుల మూడు లోకాల గరుడ పచ్చ పూస
చెంతల మాలో నున్న చిన్ని క్రిష్ణుడు
చెంతల మా లో నున్న చిన్ని క్రిష్ణుడు

||ముద్దుగారే||

కాళింగుని తలల పై గప్పిన పుష్యా రాగామూ ||2||
యేలేటి శ్రి వేంక టాద్రి ఇంద్ర నీ లమూ ||2||
పాల జల నిధి లోన బాయని దివ్య రత్నమూ
బాలునీ వలే దిరిగే పద్మ నాభుడు ||2||

||ముద్దుగారే||

No comments: