02 April 2011

మేఘమా నీలి మేఘమా మేఘమా నీలి మేఘమా

మేఘమా నీలి మేఘమా మేఘమా నీలి మేఘమా
ఉరమకే నిరవకే నీలి నీలి మేఘమా మేఘమా నీలి మేఘమా
ఉన్నరూపం మార్చుకొని నిన్ను నువ్వే కాల్చుకొని
వానవై కురవకే త్యాగమై తరగకే
మేఘమా నీలి మేఘమా

ప్రతి ప్రసవం గండమని
పతి నిమిషం మరణమని
తెలిసి కూడ కన్న తల్లులూ
ప్రతి ప్రసవం గండమని
పతి నిమిషం మరణమని
తెలిసి కూడ కన్న తల్లులూ
మరల మరల కంటారు
పగటికలలు కంటారు
బిడ్డ దైవ మంటారు
దైవమే రాయి అని
ఉలుకు పలుకు లేనిదని
తెలుసుకోరు పిచ్చి తల్లులు
మేఘమా నీలి మేఘమా
ఉరమకే నిరవకే నీలి నీలి మేఘమా
మేఘమా నీలి మేఘమా

సాగరమే సంసారమని
ఈదటమే కష్టమని
మరచిపోయి కన్న తండ్రులు
సాగరాన ప్రయణిస్తారు
మునిగితేలుతుంటారు
మునకే మిగిలునని
కన్నందుకు ఫలితమని
తెలుసుకోరు పిచ్చి తండ్రులు
మేఘమా నీలి మేఘమా
ఉరమకే నిరవకే మేఘమా నీలి మేఘమా
మేఘమా నీలి మేఘమా
ఉన్నరూపం మార్చుకుని నిన్ను నువ్వే కాల్చుకుని
వానవై కురవకే త్యాగమై తరగకే
మేఘమా నీలి మేఘమా

No comments: