09 April 2011

ఒలెంపిక్ క్రీడల్లో పేకాటకే పెద్దపీట వేస్తే

ఒలెంపిక్ క్రీడల్లో పేకాటకే పెద్దపీట వేస్తే
ఒసామా బిన్ లాడెన్ అన్నమయ్య వీసీడీ చూస్తుంటే
మడోన్నా మావూళ్ళమ్మ జాతరకొచ్చి ఫోకుసాంగు కొడితే
సహారా ఎయిర్లైన్సుకే సత్తెనపల్లి సంతలోన ఆఫీసే తెరిచేస్తే విడ్డూరం

గులాబీ రేకుల్తో గుండెజబ్బుకే మందే కనిపెడితే
జిలేబీ పానకంతో నడిచే కారులు ఇండియాకి వస్తే
మసాలాదోశలమీద పచ్చడిమీద పీహెచ్ డీ చేస్తే
పొలంలో దుక్కిని దున్నే రైతుకు సైతం లక్షల్లోనే సెల్లుబిల్లు వస్తే విడ్డూరం

సినీతారలు వానపాటలో నాభి చూపకుంటే బొడ్డూరం
సిటీరోడ్లపై యమాస్పీడులో పడవలు వెళుతుంటే తెడ్డూరం
బందరులోని మిఠాయికొట్లో స్వీటే లేకుంటే లడ్డూరం
బాఁడీలోని రక్తం రంగు బ్లేఁకే ఐపోతే రెడ్డూరం
తెలుగుఫిల్ములో తెలుగుపాటలు తెలుగుతెలిసిన తెలుగువాళ్ళతో యీరోజుల్లో పాడించారంటే విడ్డూరం

కరెంటు బల్బులపై మిణుగురు పురుగులు యుద్ధం ప్రకటిస్తే
సిమెంటు రేకులతోటి కాకులు చిలకలు గూళ్ళు కట్టుకుంటే
కొమ్మపై కోకిల గొంతుకి జలుబేచేసి విక్సు వాడుతుంటే
నాన్ వెజ్ తినడం నేను మానేశానని పులి కుందేలుకి ఫోనుచేసి చెబితే విడ్డూరం

పుంజూ పెట్టా సరసమాడగా ఆమ్లెట్ పుడుతుంటే గుడ్డూరం
తెలుగుభాషలో అక్షరాలుగా ఎక్స్,వై లే వుంటే జెడ్డూరం
ఉగాదిపచ్చడి చిల్లీచికెను కలిపే వడ్డిస్తే ఫుడ్డూరం
డన్లప్ కంపెని తాటాకులతో చాపలు చేస్తుంటే బెడ్డూరం
సోమవారము మొదలుపెట్టిన చిత్రహింసల టీవీ సీరియల్ మంగళవారమె ముగింపుకొచ్చేస్తే విడ్డూరం

No comments: