07 April 2011

వివాహాలే నశించాలీ విరాగాలే ఫలించాలీ

వివాహాలే నశించాలీ విరాగాలే ఫలించాలీ
వివాహం నాటకమన్నా కాపురం బూటకమన్నా
సమస్తం నాశనమన్న పెళ్ళి రోజుతో
ఇల్లేమో ఇరకటమంట పెళ్ళామేమో మరకటమంట
బ్రతుకంత చింత చిల్లు ముంత
ఒక్క మూడు ముళ్ళతో
వివాహాలే నశించాలీ విరాగాలే ఫలించాలీ

కైక మాట విని కాకరేగి పరలోకమేగె ఒకడు
అంబ దెబ్బ తిని పంబ రేగి ఉదకంబు తాగెనొకడు
ఇంద్రదేవుడికి ఇంటివల్ల ఒల్లంతా చెడినదపుడు
తార వల్ల మన పూర్ణ చంద్రునికి తాట లేచెనపుడు
చిత్రాంగి బలిపెట్టే తారంగుని
అప్సరస చెరిపింది రాజర్షి ని
కావ్యాలు గ్రంధాలు తిరిగేసినా
ఇతిహాస డ్రామాలు వడబోసినా
గయ్యాలి పెళ్ళాలు ఒల్లోని దెయ్యాలు
మగవాళ్ళ ప్రాణాలు తీసేటి భూతాలు
అమ్మమ్మో ఆడోళ్ళు రాంటోల్లు ఆ నోళ్ళు కలిసిన సుఖమిక సున్నా
భరతము నను పడకున్నా చిన్నా కన్నా వద్దురా
వివాహాలే నశించాలీ విరాగాలే ఫలించాలీ

ఆడదానిపై ప్రేమ అన్నది మాయరోగ మనుకో
పాముకన్నా అణుబాంబు కన్నా అది పెద్ద danger అనుకో
కొట్టులాటలు కౌగిలింతలు ఒట్టి భ్రాంతి brotheru
ముద్దు గుమ్మ తన ప్రేమ నటనతో పిప్పిచేయు నదరు
వంటింటి తాబేళ్ళూ అవ్వద్దురా
కన్నీళ్ళ కల్లాపి చల్లద్దురా
సన్యాసమే best ఏనాటికి
స్త్రీ సౌక్యమే రొస్టు మరణానికి
జై వీర హనుమాను అనుకోండి రారండి
సత్ బ్రహ్మచారులుగా చరితార్దులవ్వండి
పెళ్ళిళ్ళు మానండి పెళ్ళాళ్ళు వద్దండి
అతివను వలచుటకన్నా మతి చెడి తిరుగుట మిన్న
అయ్యా బాబు వద్దురో
వివాహం నాటకమన్నా కాపురం బూటకమన్నో
సమస్తం నాశనమన్న పెళ్ళి రోజుతో
ఇల్లేమో ఇరకటమంట పెళ్ళామేమో మరకటమంట
బ్రతుకంత చింత చిల్లు ముంత
ఒక్క మూడు ముళ్ళతో
వివాహాలే నశించాలీ విరాగాలే ఫలించాలీ
ఆ వివాహాలే ఒరబ్బాహో విరాగాలే తానా నాన నా నా న నా న న

No comments:

                              Other Blogs తెలుగు పద్యాలు|బురిడి|అంబాజిపేట |Technology Tips