05 April 2011

ఇన్నాళ్ళు నా కళ్ళు గ్రహించలేదు

ఇన్నాళ్ళు నా కళ్ళు గ్రహించలేదు నన్ను నువ్వు చూస్తుంటే
చూపుల్లో ఇలాంటి ప్రేమ దాగి ఉందని
ఎలా ఎలా క్షణాలనే వెనక్కి రప్పించడం
ఎలా ఎలా గతాలనే ఇవ్వాళగా మార్చడం
ఇన్నాళ్ళు నా కళ్ళు గ్రహించలేదు నన్ను వువ్వు చూస్తుంటే
చూపుల్లో ఇలాంటి ప్రేమ దాగి ఉందని

చివరిదాకా చెలిమి పంచే చిలిపితనమే నీవని
మనసు దాకా చేరగలిగే మొదటి పిలుపే నీదని
తెలియకుండా ఇంత కాలం ఏమి చేశానో
తెలుసుకున్న వేళలోన దూరమెంతుందో ఇలా

ఎవరు చేరి తీర్చగలరు మనసులోని లోటుని
ఎవరు మాత్రం చూపగలరు వెలుగు నింపే తోడుని
ఎదురు చూస్తూ ఉండిపోనా నేను ఇక పైన
జ్ఞాపకాన్నై మిగిలిపోనా ఎన్నినాళ్ళైనా ఇలా

No comments:

                              Other Blogs తెలుగు పద్యాలు|బురిడి|అంబాజిపేట |Technology Tips