29 May 2011

నేనే నేనే నీదాన్ని నీలో దాన్నీ

నేనే నేనే నీదాన్ని నీలో దాన్నీ..నా ప్రాణం నీదే..
నేనే నీవై నీడల్లే నీతోడుంటా..ఈ జీవితమంతా..
ఓ నదియే నన్నే మార్చి ఎండి పోగా..ఓ వానల్లే నను చేర మళ్ళీ వచ్చావ్..
నా దాహాన్ని తీర్చకనే కడలి లో కలిసినావ్

||నేనే నేనే||

కన్నా ఓ కన్నా నే నిన్నే కనలేక..
గగనం ఈ భువనం ఎంతో తలచానే
అబ్బీ ఓ రబ్బీ నా మనసును తెలిపాకే..
ఆత్మే నా ఆత్మే నా చెంతకు చేరిందే..
వేసవి యే వచ్చాక నీరే తేనవదా..
విరహం తో మరిగాక స్నేహం రుచి అవదా
నడిపించాఒక దూరం నా బ్రతుకే నీకోసం
ప్రేమిస్తా పదనేస్తం నిన్నింకా జన్మాంతం..

నేనే నేనే నీ వాణ్ణే నీలో వాణ్ణే..నా ప్రాణం నీదే..
రావే రావే నా నీడల్లే.. నీతోడుంటా నా జీవితమంతా..

దొంగా హే దొంగా నువ్ కాదని పొమ్మంటే..
కళ్ళూ నా ఒళ్ళూ నా మాటే వినలేదే..
ఎదలో ప్రేమే ఉంటే అది వాడే పోలేదే..
గుండే ఏనాడూ నిను మరిచే పోలేదే..
ఆకాశాం గతిమార్చి పోతే పోనివ్వూ..
అయినా నువ్ నన్నె మరిచీ పోనే వద్దంటా..
నువ్వొచ్చే తారకలా నే ఉన్నా నీకు అలా..
దివి మన్నై పోతున్నా మన ప్రేమలు మారవు లే..

నేనే నేనే నీదాన్ని నీలో దాన్నీ..నా ప్రాణం నీదే..
అమ్మీ అమ్మీ నే నీ వాడ్ని నే నీతోడుంటా నా జీవితమంతా..
ఓ నదియే ననేమార్చి ఎండి పోగా..ఓ వానల్లే నను చేర మళ్ళీ వచ్చావ్..
నీ దాహాన్ని తీర్చేటి ప్రేమనై వచ్చినా..

No comments: