24 November 2007

ఆకాశం తన రెక్కలతొ నన్ను కప్పుతు ఉంటె

ఆకాశం తన రెక్కలతొ నన్ను కప్పుతు ఉంటె
భూలోకం నన్ను నిద్దురపుచ్చలి
జాబిల్లి తన ఈ వెన్నెలతో నను నిద్దుర లేపి
రేయంత తెగ అల్లరి చెయ్యాలి
యేవేవొ కొన్ని కలలు ఉన్నయి అవి రేపో మాపో నిజమవ్వాలి
గుండెల్లో కొన్ని ఊహలు ఉన్నాయి అవి లోకం లోన చీకటినంత తరిమెయ్యాలి

అరారొ అని ఈ గాలి నాకే జోలలు పాడాలి
యెలేలొ అని గోదారి నాతొ ఊసులు ఆడలి
ఇంధ్ర ధనసుని ఊయల గ నేను మలచాలి
తారలన్ని నాకు హారము కావలి
మబ్బు నుండి జరు జల్లులలో నేను తడవాలి
చందమామ నాకు చందనమవ్వాలి
రంగులతో కల్లాపె చల్లాలి ఆ రంగుల నుండి లాలించె
ఒక రాగం పుట్టాలి

నా వాడు ఎక్కడున్న సరె రారాజల్లె నను చేరుకోవాలి
నా తోడంటు యెన్నడైన సరె పసి పాప్పల్లె నను చూసుకోవాలి
అమ్మలోన ఉన కమ్మదనం వెన్నలోన కలిపి
నాకు ముద్దు ముద్దు గోరు ముద్దలు పెట్టాలి
ప్రేమ లోన ఉన్న తీయదనం ప్రేమతోటి తెలిపి
చిన తప్పు చేస్తె నన్ను తీయగ తిట్టాలి
యేనాడు నా నీడై ఉండాలి
ఆ నీడను చూసి ఊటములన్ని పారిపోవాలి

No comments: