24 November 2007

నా మనసునె నీదటే నేస్తమా

నా మనసునె నీదటే నేస్తమా
నా దారిలో చేరకే చైత్రమా
సరదాల చిలిపితనమా చిరునవ్వులోని స్వరమా
నా తలుపు తట్టి కదిలించకే కవ్వించకే ప్రేమ

నాకెందుకిలా ఔతోంది చెప్పవా ఒక్కసారి
నీ వెంటపడె ఆశలకి చూపవ పూల దారి
చినుకల్లె చేరి వరదల్లె మారి ముంచేస్తె తేలేదెలాగ
తడి జాడలేని తమ గుండెలోని దాహాలు తీరేదెలాగ
లేనిపోని సయ్యాటతో వెంటాడకె ప్రేమ
నీ కనులలో వెలగని ప్రియతమా నీ పెదవిచే తెలుపనీ మధురిమ

నీ వూహలలో కొంటెతనం పలకరిస్తోంది నన్ను
నీ వూపిరితో అల్లుకుని పులకరిస్తోంది నిన్ను
అలవాటు పడిన ఎద చీకటింట సరికొత్త వేకువై రావా
కిరణాలు పడని తెర చాటులోని ఏకాంతమే వదులుకోవా
నువ్వు నేను మరిచేంతలా మురిపించకే ప్రేమా
నీ కనులలో వెలగని ప్రియతమా నీ పెదవిచే తెలుపనీ మధురిమ

2 comments:

Anonymous said...

--నా మనసునే "మీటకే" నేస్తమా--
ఆ పదం సరిచేస్తే బావుంటుంది :)

Anonymous said...

--నీ వూపిరితో అల్లుకుని పులకరిస్తోంది "వెన్ను"
--"నన్ను" నేను మరిచేంతలా మురిపించకే ప్రేమా
No offence, mistakes correct చేస్తే బావుంటుందని చెప్పాను, thanks :)