17 November 2007

చందమామ కథలో చదివా రెక్కల గుర్రాలుంటాయని

చందమామ కథలో చదివా
రెక్కల గుర్రాలుంటాయని
నమ్మడానికి ఎంత బాగుందో
బాలమిత్ర కథలో చదివా
పగడపు దీవులు ఉంటాయని
నమ్మడానికి ఎంత బాగుందో
నాకోసం రెక్కల గుర్రం ఎక్కి వస్తావని
పగడపు దీవికి నువ్వే నన్ను తీసుకెళతావని
ఇక ఏనాటికి అక్కడే మనము ఉంటామని
నమ్మడానికి ఎంత బాగుందో
నమ్మడానికి ఎంత బాగుందో
నువ్వే నాకు ముద్దొస్తావని
నేనే నీకు ముద్దిస్తానని
నమ్మడానికి ఎంత బాగుందో
నమ్మడానికి ఎంత బాగుందో

వరహాల బాట లోనా
రతనాల తోట లోనా
వజ్రాలా మేడ లోనా
బంగరు గదిలోనా
విరితేనెల్లో పాలల్లో తానాలాడేసి
నెల వంకల్లో వెన్నెల్లే భొంచేసి
నలు దిక్కుల్లో చుక్కల్నే చిలకలు చుట్టేసి
చిలకే కొరికి దరికే జరిగి మురిపం పెరిగి
మరి నువ్వే నాకు ముద్దిస్తావని
ముద్దుల్లోన ముద్దవుతానని

ఎగిరేటి ఏనుగొచ్చి
పలికేటి జింకలొచ్చి
నడిచేటి చేపలొచ్చి అడివికి రమ్మనగా
ఆ కోనల్లో కొమ్మల్లో ఊయ్యాలూగేసి
ఆ కొమ్మల్లొ పళ్ళన్ని రుచి చూసి
అహ పళ్ళళో మైకంతో మోహం కమ్మేసి
చలిగా గిలిగా తొలిగా త్వరగా అటు గా ఇటు గా
మరి నువ్వే నాకు ముద్దిస్తావని
తడి మేఘాలు ముద్రిస్తావని
నమ్మటానికి ఎంతో బాగుందో
నమ్మటానికి ఎంతో బాగుందో

నీకోసం రెక్కల గుర్రం ఎక్కి వస్తానని
పగడపు దీవికి నిన్నే నేను తీసుకెళతానని
ఇక ఏనాటికి అక్కడే మనము ఉంటామని
నమ్మడానికి ఎంత బాగుందో

No comments: