08 June 2010

ఏమిటో ఎలాగ తెలుపను ప్రేమలోని అలజడిని

ఏమిటో ఎలాగ తెలుపను ప్రేమలోని అలజడిని
ఏమని మరీ మరి చెప్పను తీయనైనా కలలుగని
ప్రేమలోని ఙాపకాలే పూల వానై రాలెనా
గాలిలోన నీటిలోన నీడలా నీ రూపమా
వేయి జన్మలైనా వదలదు ప్రేమా...

కిల కిల నవ్వుల్లో సిరి సిరి మువ్వల్లో
నేరుగా స్వరాలుగా చేరింది నువ్వే కదా
విరిసిన వెన్నెల్లో తడిసిన కన్నుల్లో
తారలా సితారలా మెరిసింది నువ్వే కదా
ఏటు చూస్తె అటునీవే కనిపిస్తేను ప్రేమే కదా!
ఏమిటో ఎలాగ తెలుపను ప్రేమలోని అలజడిని
ఏమని మరీ మరి చెప్పను తీయనైనా కలలుగని

జిలిబిలి మాటల్లో చిలకల పాటల్లో
చేరగా ఈ హాయిలా నా ప్రేమ ఆలాపనా
తొలితొలి ప్రేమల్లో తొలకరి వానల్లో
ఆశగా యుగాలుగా నీ కోసం అన్వేషణ
క్షణమైనా ఎదురైతే వినిపించాలి నా వేదనా!

ఏమిటో ఎలాగ తెలుపను ప్రేమలోని అలజడిని
ఏమని మరీ మరి చెప్పను తీయనైనా కలలుగని
ప్రేమలోని జ్ణాపకాలే పూల వానై రాలెనా
గాలిలోన నీటిలోన నీడలా నీ రూపమా
వేయి జన్మలైనా వదలదు ప్రేమా..

No comments: