కనులు కనులు కలిసెను
కన్నె వయసు పిలిచెను |2|
విసురులన్ని పైపైనే
అసలు మనసు తెలిసెను అసలు మనసు తెలిసెను
ముఖము పైన ముసురుకున్న ముంగురులె అందము |2|
సిగ్గు చేత ఎర్రబడిన బుగ్గలదే అందము
కొరిన చిన్న దాని కోర చూపె అందము కోర చూపె అందము
కనులు కనులు..... మనసు తెలిసెను
దొండ పండు వంటి పెదవి పిండుకొనుట ఎందుకు |2|
ముచ్చటైన పైట కొంగు ముడులు వేయటెందుకు
పోవాలనుకొన్నా పోలేవు ముందుకు పోలేవు ముందుకు
కనులు కనులు..... మనసు తెలిసెను
నడచినంట పిడికెడంట నడుము వణకిపొవును |2|
కసురుతున్న మనసులోనె మిసిమి వలపులూరును
కలిగిన కొపమంత కౌగిలిలొ తీరును కౌగిలిలొ తీరును
కనులు కనులు..... మనసు తెలిసెను
No comments:
Post a Comment