11 June 2010

సాహసమే చెయిరా డింబకా

సాహసమే చెయిరా డింబకా అన్నది కదరా పాతాళభైరవి
చొరవగా దూకకపోతే సాధించలేవురా నువ్వనుకున్నదీ
ధైర్యముంటే హహహహ దక్కుతుందీ హహహహ రాకుమారీ
తెలివిగా వెయిరా పాచిక కళ్ళో మేనక ఒళ్ళొ పడదా
సులువుగా రాదురా కుంక బంగారు జింక వేటాడాలిగా
నింగిదాకా హహహహ నిచ్చనేద్దాం హహహహ ఎక్కిచూద్దం హహహహ ఒహొ హొ

చందమామను అందుకొనే ఇంధ్ర భవనాన్ని కడతానురా
పడవంత కారులోన బజారులన్ని షికారు చేస్తానురా
సొంతమైన విమానములో స్వర్గలోకాన్ని చుడతానురా
అపుడు అప్సరసలు ఎదురు వచ్చి కన్ను కొడతారురా
చిటికేస్తే హహహహ సుఖమంతా హహహహ మనదేరా
సాహసమే చెయిరా డింబకా అన్నది కదరా పాతాళభైరవి
చొరవగా దూకకపోతే సాధించలేవురా నువ్వనుకున్నదీ
ధైర్యముంటే హహహహ దక్కుతుందీ హహహహ రాకుమారీ హహహహ ఒహొ హొ

సున్నిఉండలు కందిపొడి ఫాక్టరీలోన పండించని
అమెరికా ఇరాను జపాన్ ఇరాకు జనాలు తింటారనీ
కొన్ని ఎంపీలను కొంటా కొత్త పీఎమ్ని నేనేనంటా
స్కాములెన్నొ చేసి స్విస్ బాంకుకేసి డాలర్లలో తేలుతా
సుడి ఉంటే హహహహ ఎవడైనా హహహహ సూపర్ స్టారే
సాహసమే చెయిరా డింబకా అన్నది కదరా జై పాతాళభైరవి
చొరవగా దూకకపోతే ఐం వెరీ సారీ నువ్వనుకున్నదీ
ధైర్యముంటే హహహహ దక్కుతుందీ హహహహ రాకుమారీ హహహహ ఒహొ హొ

No comments: