03 June 2010

మరుగేలా... మబ్బు ముసుగేల రా....

మరుగేలా... మబ్బు ముసుగేల రా....
ఓ చందమామా ఓ చందమామా
మనసున మల్లెలు విరిసిన వేళా
మమతల పల్లవి పలికిన వేళా
మౌనమె మోహన రాగమయే వేళా

మరుగేలా... మబ్బు ముసుగేల రా....

మాటకు అందని ఊసులు లేవా చూపులలో...
చూపులు చేరని సీమలు లేవా ఊహల లోనా
కొన చూపునా చిగురాశలూ బరువైన రెప్పల్లొ బంధించకు...
విను వీధిలో స్వప్నాలకీ సంకెళ్ళు వేసేటి జంకెందుకూ...
ఊయలలూపే మృదుభావాలు ఊపిరి తీగను మీటే వేళ
మౌనమె మోహన రాగమయే వేళా

మరుగేలా... మబ్బు ముసుగేల రా....

కాంచన కాంతుల కాంక్షల బాట కనబడలేదా
కొమ్మల పూసిన కోయిల పాట వినపడ లేదా
ఉలి తాకినా శిల మాదిరి ఉలికులికి పడుతుంది ఎదలో సడి
చలి చాటునా మరుమల్లెకీ మారాకు పుడుతుందొ ఏమో మరి
చెంతకు చేరే సుముహూర్తానా ఆశలు తీరే ఆనందాన
మౌనమె మోహన రాగమయే వేళా

మరుగేలా... మబ్బు ముసుగేల రా....

No comments: