02 June 2010

పంచమి పూటా మంచిదనీ మాటిచ్చాను పొరపాటు

పంచమి పూటా మంచిదనీ మాటిచ్చాను పొరపాటు..
వచ్చేవారంముచ్చటనీ రాసిచ్చను ఎదచాటు..
ఆ మాటే నా కొంప ముంచిందీ.. ఆ రాతే నా దుంప తెంచిందీ.. ||౨||
అయ్యో అయ్యో అయ్యో అయ్యో అయ్యో అయ్యో
అయ్యో పాపం మంచోడనీ చనువిచ్చాను పొరపాటూ..
ఊపిరి నేనే అన్నాడనీ మనసిచ్చాను గ్రహపాటూ..
ఆ చనువే నా కొంప ముంచిందీ ఆ మనసే నా దుంప తెంచిందీ..||2|\
అయ్యో అయ్యో అయ్యో అయ్యో అయ్యో అయ్యో

కళ్ళల్లోకీ చూస్తే సంకెళ్ళు వేసేస్తావు.. నీ పైట చాటుకు వస్తే చాపల్లె చుట్టేస్తావూ
కలలోకి రావద్దన్నా వస్తావు రేయంతా..
ఈ ప్రేమ ముద్దరలన్నీ వేస్తావు ఒళ్ళంతా
సరదాలే ఈ వేళా సరిగమలే పాడాయి
ఆ మాటే అన్నావు చాలింకా నీ మోజే మళ్ళిందీ నా వంక
అయ్యో అయ్యో అయ్యో అయ్యో అయ్యో అయ్యో

||పంచమి||

ఎదురుగ ఉన్నా కానీ ఎదలోకి రమ్మన్నానా
ఎగతాళికన్నా కాని నను దోచుకొమ్మన్నానా
వగలన్నీ చూస్తూ ఉంటే వయసూరుకుంటుందా
కనుసైగ చేస్తూ ఉంటే వలపాపుకుంటుందా
సరికొత్త గుబులేదో గుండెల్లో రేపేవు
ఈ వింతే పులకింత కావాలి నీ చెంతే బ్రతుకంత సాగాలి
అయ్యో అయ్యో అయ్యో అయ్యో అయ్యో అయ్యో

||పంచమి||

No comments: