కనులు కనులతో కలబడితే ఆ తగువుకు ఫలమేమి కలలే
కనులు కనులతో కలబడితే ఆ తగువుకు ఫలమేమి, కలలే
నా కలలో నీవే కనబడితే ఆ చొరవకు బలమేమి మరులే
మరులు మనసులో స్ధిరపడితే ఆపై జరిగేదేమి మనువు
మనువై ఇద్దరు ఒకటైతే ఆ మనుగడ తీరేమి సంసారం ||కనులు ||
అల్లరి ఏదో చేసితిని చల్లగ ఎదనే దోచితివి ||2||
ఏమీ లేని పేదనని నాపై మోపకు నేరాన్ని ||2||
లేదు ప్రేమకు పేదరికం నే కోరను నిన్ను ఇల్లరికం ||2||
నింగీ నేలకూ కడుదూరం మన ఇద్దరి కలయిక విడ్డూరం ||కనులు ||
1 comment:
superb romantic song...it is too melody and i like so much
Post a Comment