28 September 2011

అన్నానా భామిని ఏమని

అన్నానా భామిని ఏమని
ఎపుడైనా అన్నానా భామిని ఏమని
అరవిరిసిన పూలలోన నీదు మురుపెమెరసేనని ||2||
మాటవరసకెపుడైనా అన్నానా భామిని ఎపుడైనా
అన్నానా మోహనా ఏమని
ఎపుడైనా ఆ అన్నానా మోహనా ఏమనీ
తొలిచూపుల నాడె నీవు వలపు దోచుకొనినావని ఆహా
తొలిచూపుల నాడె నీవు వలపు దోచుకొనినావని
ఆదమరచి ఎపుడైనా అన్నానా మోహనా ఎపుడైనా

లోకానికి రాజునైనా నీ ప్రేమకు దాసుడనని హ్మ్ హ్మ్
లోకానికి రాజునైనా నీ ప్రేమకు దాసుడనని
మాటవరసకెపుడైనా అన్నానా భామిని ఎపుడైనా

నిన్నె నమ్ముకొన్నానని నీవే నా దైవమనీ ఆహా
నిన్నె నమ్ముకొన్నానని నీవే నా దైవమనీ
ఆదమరచి ఎపుడైనా అన్నానా మోహనా ఎపుడైనా
అన్నానా మోహనా ఎపుడైనాఆ ఆ ఆ ఆ

No comments:

                              Other Blogs తెలుగు పద్యాలు|బురిడి|అంబాజిపేట |Technology Tips