30 September 2011

సిరిమల్లె పువ్వల్లె నవ్వు చిన్నారి పాపల్లే నవ్వు

హ్హ హ్హ హ్హ సిరిమల్లె పువ్వల్లె నవ్వు చిన్నారి పాపల్లే నవ్వు
చిరకాలముండాలి నీ నవ్వు
చిగురిస్తు ఉండాలి నా నువ్వు నా నువ్వు హ్హ హ్హ హ్హ హ్హ హ్హ
సిరిమల్లె పువ్వల్లె నవ్వు చిన్నారి పాపల్లె నవ్వూ నవ్వూ

ప ని స హ్హ హ్హ హ్హ హ్హ స గ మ హ్హ హ్హ హ్హ
గ మ ప ఆ ఆ హ్హ హ్హ ని ని ప మ గ గ మ ప హ్హ హ్హ హ్హ హ్హ ఆ ఆ ఆ

ఆ ఆ చిరుగాలి తరగల్లె మెలమెల్లగా సెలయేటి నురగల్లె తెలతెల్లగా
చిరుగాలి తరగల్లె మెలమెల్లగా సెలయేటి నురగల్లె తెలతెల్లగా
చిననాటి కలలల్లె తియతియ్యగా
ఎన్నెన్నో రాగాలు రవళించగా రవళించగా ఉహూ హ్హ హ్హ హ్హ
సిరిమల్లె పువ్వల్లె నవ్వు చిన్నారి పాపల్లె నవ్వూ నవ్వూ

నీ నవ్వు నా బ్రతుకు వెలిగించగా ఆ వెలుగులో నేను పయనించగా
నీ నవ్వు నా బ్రతుకు వెలిగించగా ఆ వెలుగులో నేను పయనించగా ఆ ఆ ఆ ఆ
వెలుగుతూ ఉంటాను నీ దివ్వెగా
ఆ వెలుగుతూ ఉంటాను నీ దివ్వెగా
నే మిగిలి ఉంటాను తొలి నవ్వుగా తొలి నవ్వుగా
సిరి మల్లె పువ్వల్లె నవ్వు చిన్నారి పాపల్లె నవ్వు
చిరకాలముండాలి నీ నవ్వు చిగురిస్తు ఉండాలి నా నువ్వు నా నువ్వు
హ్హ హ్హ హ్హ హ్హ హ్హ సిరిమల్లె పువ్వల్లె నవ్వు హ్హ హ్హ హ్హా
చిన్నారి పాపల్లె నవ్వూ హ్హ హ్హ హ్హ

No comments:

                              Other Blogs తెలుగు పద్యాలు|బురిడి|అంబాజిపేట |Technology Tips