16 November 2007

వెయ్యిన్నొక్క జిల్లాలవరకు వింటున్నాము నీ కీర్తినే

వెయ్యిన్నొక్క జిల్లాలవరకు వింటున్నాము నీ కీర్తినే
ముల్లోకాల ఏ మూలవిన్నా నీ అందాల సంకీర్తనే
హంపీ లోని శిల్పాలకి ఎల్లోరాల నాట్యాలకి
నువ్వే మోడలయ్యావొ ఏమో వయ్యారీ

వెయ్యిన్నొక్క

ఖర్మ కాలి రావణుండు నిన్ను చూడలేదుగాని
సీత ఊసునే తలచునా పొరపడీ
భీష్మూడున్న కాలమందు నువ్వు పుట్టలేదుగాని
బ్రహ్మచారిగా బ్రతుకునా పొరపడీ
ఇంత గొప్ప అందగత్తె ముందుగానె పుట్టివుంటే
పాత యుద్ద గాథలన్నీ మారి వుండేవే
ఇంత గొప్ప అందగత్తె ముందుగానె పుట్టివుంటే
పాత యుద్ద గాథలన్నీ మారి వుండేవే
పొరపాటు బ్రహ్మది గాని సరి లేనిదీ అలివేణి

వెయ్యిన్నొక్క

అల్లసాని వారిదంత అవక తవక టేష్టు గనక
వెళ్ళి పోయెనె చల్లగా ప్రవరుడూ
వరూధినిని కాక నిన్నే వలేసుంటె కళ్ళు చెదిరి
విడిచిపెట్టునా భామినీ బ్రహ్మడు
ఒక్క సారి నిన్ను చూస్తే రెప్ప వెయ్యలేరు ఎవరూ
కాపురాలు గంగకొదిలి వెంట పడతారే
ఒక్క సారి నిన్ను చూస్తే రెప్ప వెయ్యలేరు ఎవరూ
కాపురాలు గంగకొదిలి వెంట పడతారే
ముసలాడి ముడతలకైనా కసి రేపగలదీ కూనా

వెయ్యిన్నొక్క

No comments: