03 June 2010

జాబిలమ్మవో జాజికొమ్మవో

జాబిలమ్మవో జాజికొమ్మవో
గాజుబొమ్మవో ఓ మైనా i love u
పచ్చబొట్టువో పుట్టుమచ్చవో
తేనెపట్టువో i dont know what to do
ఇంటిముందు రంగవల్లివో
ఓ చెలీ పెరటిలొన తులసిమొక్కవో
మందిరాన భక్తి పాటవో
ఓ ప్రియా కులుకుతున్న తెలుగు చిలకవో
పరిచయం ఇష్టమై ఇష్టమే స్నేహమై
ప్రాణమై నిలిచినావుగా

నీ పెదాలపైన నా పెదాలతోనా
నీ పెదాలపైన నా పెదాలతోనా
ఆ పదాలు నీకు రాసి చూపనా
ఈ క్షణాలలోన ఆ యుగాలు దాటి
ఈ క్షణాలలోన ఆ యుగాలు దాటి
ఆ జగాలలోన ప్రేమ పంచనా
బొట్టు మీద ఒట్టుపెట్టనా
కాటుకల్లే కావలుండనా
గుండె మీద ఒట్టుపెట్టగా
అడుగులోనా గూడూ కట్టనా
జన్మకే బంధమై ప్రేమకే బానిసై
పూజకే భక్తుడవ్వనా

నీ మనస్సులోకి నా మనస్సు చేరి
నీ మనస్సులోకి నా మనస్సు చేరి
ఆ తపస్సు చేసి ప్రేమ పొందగా
నీ వయస్సు తోటీ నా వయస్సు కూడి
నీ వయస్సు తోటీ నా వయస్సు కూడి
ఆ సమస్యలన్నీ ఆవిరవ్వగా
ముత్యమంత ముద్దు పెట్టనా
మూడు ముళ్ళ బంధమెయ్యనా
వెన్నెలంత ముద్దు పెట్టనా
ఏడు జన్మలేకమవ్వనా
రేయికే రాజునై పగటికే బంటునై
రాణికే రాజ్యమవ్వనా

No comments: