03 June 2010

పుల్లని పుల్లట్టు పంటి కంటగానే

||పల్లవి||
పుల్లని పుల్లట్టు పంటి కంటగానే...... జివ చచ్హిన జన్మకే జీవమొచ్హెరా..... ఇది అట్టంటే........
పుల్లని పుల్లట్టు పంటి కంటగానే...... జివ చచ్హిన జన్మకే జీవమొచ్హెరా.....
ఎసేటి అట్లమీద యావ పుట్టగానే..... ఎసి లో తిండి మీద ఎగడు పుట్టెరా.....
ఫైవ్ స్టార్ మీద పెట్టు మన అట్టే బెస్టూ...... మీ అందరి మీద ఒట్టు మినపట్టే టెస్టూ
ఫైవ్ స్టార్ మీద పెట్టు మన అట్టే బెస్టూ...... మీ అందరి మీద ఒట్టు మినపట్టే టెస్టూ ||పుల్లని||

||చరణం 1||
రాతిరోలు లోన రుబ్బి రవ్వ లోన కలిపి........ రేకు పెనం మీద నరాఫ్ కొత్త నూనె దులిపి
కట్లపొయ్యి మీద దాన్ని అట్లకాడ తొ వేసి...... పొడి కారం పైన చల్లి పొగ చూరకుండ తీసి
కాలుతున్న అట్టుముక్క నాలుక మీదెట్టుకుంటే............
కాలుతున్న అట్టుముక్క నాలుక మీదెట్టుకుంటే
నషాళానికెక్కి మాంచి ఉషారుపుట్టిస్తదిరా పుల్లట్టు........
అబ్బబబ్బబబ్బబబ్బ ||పుల్లని||

||చరణం 2||
కట్లెట్లు పిజ్జాలు దీనిముందు దిగదుడుపు........నూడుల్స్ చికెనురోల్స్ అరగవురా పరగడుపు
హాట్డాగ్ బర్గర్లని ఇంగిలిపీసు మరిగినోడు ఫాస్ట్ ఫుడ్డు తిన్నాక టేస్టు మరిసిపోతాడు
తెలుగింటి పుల్లట్టును తిన్నోడు ఎవడైనా.............
తెలుగింటి పుల్లట్టును తిన్నోడు ఎవడైనా.............
పదేళ్ళైన మరిసిపోడు పదే పదే అడుగుతాడు పుల్లట్టు......
అట్టు అట్టు అట్టు ||పుల్లని||

No comments: