03 October 2010

ఎవరి కోసం ఎందుకోసం ఎవరి కోసం ఎందుకోసం

ఎవరి కోసం ఎందుకోసం ఎవరి కోసం ఎందుకోసం
ఈ వేదన రోదనలూ ఈ నిరాశ నిస్పృహలూ కన్నీటి జీవితాలూ
ఎంతకాలం ఇంకెంత కాలం
చెమటను ధారలు కట్టీ చేలు చెలుక తడిపినాము
పాదుపాదులోన మనం ప్రాణాలను నాటినాము
కంటికి రెప్పేయకుండ పంటను కాపాడినాము
కంటికి రెప్పేయకుండ పంటను కాపాడినాము
బురద నుండి బువ్వ తీసి ఆకలితో చచ్చినామూ
ఎవరి కోసం ఎందుకోసం ఎవరి కోసం ఎందుకోసం

ఎన్నాళ్ళు ఈ బాధలు ఏడుపింక మనకొద్దూ
గడ్డిపోచలన్ని కలిసి గజమును బంధించినట్టూ
చీమలన్ని ఏకమై పెను పామును చంపినట్టూ
వాన చినుకలన్ని కలిసి వాగులై పొంగినట్టు
వాన చినుకలన్ని కలిసి వాగులై పొంగినట్టు
కూలినాలి పేక కడితె కూలవా దోపిడి దొంగలు కట్టిన కోటలూ
కూలినాలి పేక కడితె కూలవా దోపిడి దొంగలు కట్టిన కోటలూ

భూమి కోసం విముక్తి కోసం భూమి కోసం విముక్తి కోసం
ఈ రణ నినాదం సాగించే ఈ సమరం పారించే ఈ రుధిరం
భూమి కోసం విముక్తి కోసం

కను గుడ్లను పీకినా కాలు చేయి నరికినా
దొంగ కేసు బనాయించి జైల్లలొ పడదోసినా
ఉరికొయ్యల పాల్జేసినా ఎన్‌కౌంటరులో చంపినా
ఉరికొయ్యల పాల్జేసినా ఎన్‌కౌంటరులో చంపినా
ఎత్తిన జెండను ఎన్నడు దించమూ పోరుబాట ఏనాడూ వదలమూ
ఎత్తిన జెండను ఎన్నడు దించమూ పోరుబాట ఏనాడూ వదలమూ

భూమి కోసం విముక్తి కోసం భూమి కోసం విముక్తి కోసం
ఈ రణ నినాదం సాగించే ఈ సమరం పారించే ఈ రుధిరం
భూమి కోసం విముక్తి కోసం భూమి కోసం విముక్తి కోసం

No comments: