03 October 2010

కోకిలమ్మ పెళ్ళికి కోనంతా పందిరి

కుకు కుకు కుకు కుకు
కోకిలమ్మ పెళ్ళికి కోనంతా పందిరి
చిగురాకులు తోరణలు చిరుగాలి సన్నాయి
డుడు డుడు డుడు డుడు
వసంతుడే పెళ్ళికొడుకు వనమంతా సందడి
పూలన్ని తలంబ్రాలు పున్నమి తొలిరేయి

తుళ్ళి తుళ్ళి నిన్న మొన్న తునీగల్లె ఎగిరిన
పిల్లగాలి కొచ్చింది కళా పేళ్ళి కళా
తలపులన్ని వలపులైన సోకులు విరిచూపులైన
పెళ్ళికొడుకు నవ్వితే తళా తళ తళా
పూలగాలితో రేగిన పుత్తడి పారాణి గా
చిలక పాటా నెమలి ఆటా కలిసి మేజువాణిగా
పూలగాలితో రేగిన పుత్తడి పారాణి గా
చిలక పాటా నెమలి ఆటా కలిసి మేజువాణిగా
అందమైన పెళ్ళికి అందరు పేరంటాలే
అడవి లోని వాగులన్ని ఆనందపు కెరటాలై

కన్ను కన్ను కలుపుకున్న కన్నె మనసు తెలుసుకున్న
కనుల నీలి నీడలే కద ప్రేమ కదా
బుగ్గలల్లో నిగ్గు తీసి సిగ్గులల్లో చిలకరించు
మూగ వలపు విచ్చితే కద పెళ్ళి కదా
చిరు మనసుల ఒకటనువై
ఇరుతనువులకు ఒకమనువై
మనసులోని వలపుల్లని మల్లెలా విరిపానుపులై
చిరు మనసుల ఒకటనువై
ఇరుతనువులకు ఒకమనువై
మనసులోని వలపుల్లని మల్లెలా విరిపానుపులై
కలిసివున్న నూరేళ్ళు కలలు కన్న వెయ్యేల్లు
మూడు ముళ్ళు పడిననాడు ఎదలొ పూల పొదరిల్లు

No comments: