04 October 2010

అలా చూడు ప్రేమ లోకం పిలుస్తున్నదీ

అలా చూడు ప్రేమ లోకం పిలుస్తున్నదీ
కలే నేడు తీపి నిజమే ఫలిస్తున్నదీ
ప్రపంచమంతా దాటేద్దాం పద అన్నదీ
ప్రేమించుకుందాం రా నేస్తం మన వయస్సు తపస్సు తరించు వరమిది

ప్రతి జన్మ నీతోనే ముడేశాడు బ్రహ్మ
అనే నమ్మి నీ పేరే జపించానులేమ్మా
అదే పాట నా దాక ఏలా చేరనమ్మా
ప్రతీ బాట నా వైపే నిన్నే పంపెనమ్మా
నిరంతరం నీ వూసేదో నను రమ్మన్నదీ
ప్రతి క్షణం నీ ధ్యాసేగా కలవరించి వరించి రప్పించుకున్నది

అలల్లాంటి ఈ రాగం నువ్వే నేర్పలేదా
తుఫానంటి ఈ వేగం నువ్విచింది కాదా
వెలేవేసి లోకాన్ని ఎటో వెళ్ళిపోదాం
ఏదో చేసి కాలాన్ని అలా ఆగమందాం
రహస్య రాజ్యం చేరే జత కధే ఇది
సుఖల తీరం కోరే మన ప్రయాణమివాళ ఫలించు క్షణమిది

No comments:

                              Other Blogs తెలుగు పద్యాలు|బురిడి|అంబాజిపేట |Technology Tips