నెలరాజా పరుగిడకు
చెలివేచే నాకొరకు
ఒక్కమారు పోయి
చెలినిగాంచుమా
నివేదించుమా విరహమే || నెలరాజా ||
మబ్బులలో తళుకుమనే మెరుపేలే చెలి అందం
ముచ్చటగా ముత్యం లా మెరిస్పడే సఖి అందం ||2||
వాడిపోనిదీ వనిత యవ్వనం
ఆడిపాడితే కనుల నందనం
అణువణువు విరిసేదే లావణ్యం || నెలరాజా ||
ముంగిటనే రాచిలుకా పలికేనూ స్వాగతము
మురిపెముగా తమ రాకా నా చెలితో తెలిపేనూ ||2||
కొండవాగులా మల్లెతీగలా
పులకరించినా సన్నజాజిలా
విరహిణిలా వేచేను జవరాలే || నెలరాజా ||
No comments:
Post a Comment