13 November 2010

మామా చందమామా వినరావా నా కధ

మామా చందమామా వినరావా నా కధ ||2||
వింటే మనసు ఉంటే కలిపేవూ నా జత
మామా చందమామా

నీ చల్లని కిరణాలలో జగమంతా మురిసెనే ||2||
నాలోన లోపమేమో నా మనసే కుమిలెనే
అందరికీ ఆనందం అందించే జాబిలి
నాపైన నీకేలా రాదాయే జాలి ||మామా||

మచ్చ నీకు ఉన్నా లెక్క చెయ్యరే
ముచ్చటైన నీ వెన్నెలనే మెచ్చుకుందురందరూ
మచ్చలేని నన్ను వెక్కిరింతురే
పిచ్చిదానినంటూ నాపై లేని మచ్చ వేసేరు
నిజము తెలిపినా వినరు మనసు తెలుసుకోలేరు ||2||
నీవుకాక నా వెతలన్నీ వినేవారు ఎవ్వరు
వినేవారు ఎవ్వరు ||మామా||

No comments: