ఓ నేనే ఓ నువ్వని ఒక తీరే మన ప్రేమని
నీ గూటికే రాని
నేనంటు ఇక లేనని నీ వెంటే ఉన్నానని చాటనీ
చేసానే నీ స్నేహాన్నిపోల్చానే నాదో కానీ
నీ వాణ్ణి
ఓ నేనే ఓ నువ్వని ఒక తీరే మన ప్రేమని
నీ గూటికే రాని
మారాము చేసే మారాణి ఊసే నాలోన దాచానులే
గారాలు పోయే రాగాల హాయే నా గుండెనే తాకెలే
నీ కొంటె కోపాలు చూడాలనే దొబూచులాడేను ఇన్నాళ్ళుగా
సరదా సరాగాలు ప్రేమేగా
ఓ నేనే ఓ నువ్వని ఒక తీరే మన ప్రేమని
నీ గూటికే రాని
నీ నీడలాగ నీతోనే ఉన్నా నీ జంట నేనవ్వనా
వేరెవ్వరు నా నీ గుండెలోన నా కంట నీరాగునా
ఆ తలపు నా ఊహకే తోచునా నా శ్వాస నిను వీడి జీవించునా
నీ కంటి పాపల్లే నేలేనా
ఓ నేనే ఓ నువ్వని ఒక తీరే మన ప్రేమని
నీ గూటికే రాని
నేనంటు ఇక లేనని నీ వెంటే ఉన్నానని చాటనీ
చేసానే నీ స్నేహాన్నిపోల్చానే నాదో కానీ
నీ వాణ్ణి
No comments:
Post a Comment