కొమ్మ కొమ్మా విన్నావమ్మ కోయిల వస్తుంది
వస్తూ వస్తూ తనతో వెన్నెల వెలుగు తెస్తుంది
ఏవమ్మా మరుమల్లి తోరణాలు కడతావా
చిలకమ్మ ఎదురేగి స్వాగతాలు చెపుతావా
పూల పొదరిల్లే రా రమ్మన్నది
విన్నానమ్మా తియ్యని వేణువు రమ్మని పిలుపులని
చూసనమ్మా స్వాగతమంటు తెరిచిన తలుపులని
పగలు రాత్రి అంటూ తెడా లేనే లేని పసి పాప నవ్వులని చూడనీ
తోడు నీడనువ్వై నాతో నడి చే నీకు ఏనాటి ౠనముందో అడగనీ
చేదు చేదు కలలన్ని కరిగితేనే వరదవని
కానుకైన స్నేహాన్ని గుండె లోన దాచుకొని
ప్రతి జన్మకి ఈ నేస్తమే కావాలని కోరుకుంటానమ్మా దేవుల్లని
ఇదిగో నిన్నే అంటూ ప్రేమే ఎదురై వస్తే ఏ పూలు తేవాలి పూజకి
నీతో జతగా ఉండే వరమే నువ్వే ఇస్తే ఇంకేమి కావాలి జన్మకి
మచ్చలేని చంద్రుడిని మాట రాక చూస్తున్న
వరస కాని బంధువుని చొరవచేసి అంటున్నా
ఇకెప్పుడు ఒంటరినని అనరాదనీ
నీకు సొంతం అంటే నేనేనని
No comments:
Post a Comment