03 June 2010

తొలి కోడి కూసెను

తొలి కోడి కూసెను
తెలవార వచ్చేను
మరుకేళీ చాలించి నిదురపో
తొలి కోడి కూసెను ..
తెల వార వచ్చేను ..
మరుకేళీ చాలించి నిదురపో

నాదుమొర కాస్త ఆలించి నిదురపో
అందగాడ నిదురపో చందురూడా నిదురపో
అందగాడ నిదురపో చందురూడా నిదురపో
తొలి కోడి కూసెను ..తెల వార వచ్చేను ..మరుకేళీ చాలించి నిదురపో

ఇల్లంతా కడగాలి కళ్ళాపి చల్లాలి ముగ్గులు పెట్టాలి గోపాలుడా
కాఫీలు కలపాలీ టిఫ్ఫినీలు చెయ్యలి చెంగు విడిచి పెట్టు గోపాలుడా
చెంగు విడిచి పెట్టి సెలవిచ్చి పంపితే మాపటేలకు మళ్ళీ వస్తాను
తెల్ల చీర కట్టి మల్లె పూలు పెట్టి
గుమ్ము గుమ్మను కౌగిలీస్తాను
గుండేలో వలపంతా గుమ్మరిస్తాను
చెంగు వదలడు సామీ గోపాలుడా!..
సరసుడ నా స్వామీ గోపాలుడా...

తొలి కోడి కూసెను ..
తెల వార వచ్చేను ..
మరుకేళీ చాలించి నిదురపో

సుప్పనాతి సూరీడొచ్చెను
వెన్నలంతా ఎర్ర బారెను
మల్లెలన్ని నల్ల బోయెను
కలువ కన్నియా కందిపోయెను
కమిలిపోయెను పానుకో
కంటి నిండా నిదురకోసం
కాచి ఉన్నది చూసుకో ..
కసిక రాజ నిదుర పో

మూడు ఝాములు తిరగలేదు నాలుగోది పొడవలేదు
తొందరెందుకు సురీడా ఎందుకొస్తివి సూరీడా
నిన్నెవరు పిలిచారు సూరీడా నీకిక్కడేమి పని సూరీడా
నీకిప్పుడేమి పని సూరీడా.....
పోరా పోరా సూరీడా
రారా రారా .. సూరీడా
పోరా పోరా సూరీడా
నువ్వు రారా రారా .. సూరీడా
పోరా పోరా.. రారా రారా ..
పోరా పోరా.. రారా రారా ..
రారా .. పోరా.. రారా .. పోరా ..
రారా .. పోరా.. రారా .. పోరా ..

No comments: