11 January 2011

ఒక్కడంటే ఒక్కడే హ్యాండ్‌సమ్

పల్లవి :
ఒక్కడంటే ఒక్కడే హ్యాండ్‌సమ్
వీడి ఉక్కులాంటి బాడీ ఆఁసమ్
వీడు ఎప్పుడైనా నాకే సొంతం
వీడి చూపుల్లోన న్యూక్లియర్ దాడి
వీడి ఊపిరేమో సూర్యుడంత వేడి
వీణ్ని తట్టుకునే మొనగాడేడి
ఆ కింగ్ లాంటి వాడీ కేడీ
వీడి టచ్చులోన పొంగుతాది నాడి
వీడి నవ్వులోన లొంగుతాది లేడి
వీడి పేరు చాలు పెదవికి మెలడీ
వీడే వీడే వీడే నాకు తగ్గ జోడీ

చరణం : 1
ఎక్కడెక్కడని వెతికిస్తాడే
పక్క పక్క నుండి కవ్విస్తాడే
తిక మకతిక కలిగిస్తాడే రకరకములుగా
ఒక్క నన్నే కొంటె కన్నై
అతి కలివిడిగా కదిపాడే
జంట కోరుకున్న ఒంటరిగా
వీడి ఇంటి పేరు అరువిచ్చాడో
నా ఒంటి పేరు ముందు అతికిస్తా
చిట్టి గుండె మీద చోటిచ్చాడో
నే పక్క దిండు పరిచేస్తా
ఎంత మంది వీడి వెంట పడ్డారో
నా కంటి రెప్పల్లోన దాచేస్తా
వీడినెంతమంది ఇష్టపడ్డారో
ఓ ముద్దు పెట్టి దిష్టి తీస్తా

చరణం : 2
వయసడిగిన వాక్సిన్ వీడే
మనసడిగిన మాన్‌సూన్ వీడే
కలలడిగిన క్యూపిడ్ వీడే కసిపెంచాడే
మనువాడే మగవాడే అని మరిమరి
మురిపించాడే మతి చెడగొట్టేశాడే
ఒక్క ముక్కలో చెప్పాలంటే
వాడి పక్కనున్న కిక్కే వేరే
ఈ సక్కనోడు దక్కితే చాల్లే
ఇంక వేరే ం కావాలే
నా టెక్కులన్ని పక్కనెడతాలే
సర్వహక్కులన్ని ఇచ్చుకుంటాలే
జంటలెక్కలన్ని తక్కువవకుండా
నే మొక్కు తీర్చుకుంటా

No comments: