21 January 2011

చందమామలా అందగాడిని

చందమామలా అందగాడిని
చుక్కలెందరో నా వెనకే
చుక్కలెందరో చుట్టిముట్టినా
చెలి కొరకే నా పరుగే

పెదవులు పగడ కాంతులు
పలుకులు చెరుకు బంతులు
నడకలు నెమలి గంతులు
గలగలగలలు
కనులలో కోటి రంగులు
నడుములో మర ఫిరంగులు
కురులలో జలధి పొంగులు
జలజలజలలు
తన కొరకే కలవరమై
తన వరకే చెలి స్వరమై
తన దరికే నా ప్రాణమే ప్రయాణమై


జిగిబిగి మనసు సంకెల
తెగువగ తెంచా నేనిలా
మగువను మార్చా ప్రేమలా
తొలితొలితొలిగా
పరిచిన పసిడి దారిలా
విరిసిన వెలుగు ధారలా
నడిచా ఆమె నీడలా కలకలకలగా
తన వలపే అమృతము
తన వరమే జీవితము
తన పరమై తరించనీ ఈ సోయగము

No comments:

                              Other Blogs తెలుగు పద్యాలు|బురిడి|అంబాజిపేట |Technology Tips