11 January 2011

నందామయ గురుడ నందామయ

పల్లవి:

నందామయ గురుడ నందామయ ఆనందదేవికి నందామయ
నందామయ గురుడ నందామయ ఆనందదేవికి నందామయ

చరణం1:

స్వాతంత్రయుద్ధాన జయభేరి మోగించి
శాంతమూర్తులు అంతరించారయ
స్వాతంత్ర గౌరవము సంతలో తెగనమ్ము
స్వార్ధమూర్తులు అవతరించారయ
వారు వీరౌతారు వీరు వారౌతారు
మిట్ట పల్లాలేకమౌతాయయ
తూరుపుదిక్కున తోకచుక్కపుట్టి పెద్దఘటములకెసరు పెట్టేనయ
నందామయ గురుడ నందామయ ఆనందదేవికి నందామయ

చరణం2:

కనకాద్రి శికరాన శునకమ్ము సింహమై
ఏడు దీవుల రాజ్యమేలేనయ
గుళ్ళు మింగేవాళ్ళు,నోళ్ళు కొట్టేవాళ్ళు
ఊళ్ళో చెలామణి అవుతారయ
నందామయ గురుడ నందామయ ఆనందదేవికి నందామయ

చరణం3:

అ ఆ లు రానట్టి అన్నయ్యలందరికి
అధికార యోగమ్ము పడుతుందయ
కుక్క తోక పట్టి గోదావరీదితే
కోటిపల్లికాడ తేలేరయ
నందామయ గురుడ నందామయ ఆనందదేవికి నందామయ

చరణం4:

గొర్రెలను తినువాడు గోవింద కొడతాడు
బర్రెలను తినువాడు వస్తాడయ
పగలె చుక్కలనింక మొలిపించునంటాడయ
నగుబాట్లుబడి తోక ముడిచేనయ
నందామయ గురుడ నందామయ ఆనందదేవికి నందామయ

చరణం5:

దుక్కి దున్నేవాడు భూమి కామందౌచు దొరబాబువలె చలాయిస్తాడయ
అద్దెకుండేవాడు ఇంటి కామందునని ఆందోళనము లేవదీస్తాడయ
అంబూరుకాడ ఆటంబాంబు బ్రద్దలై తొంబ తొంబగ జనులు చచ్చేరయ
తిక్క శంకర స్వామి చెప్పింది నమ్మితే చిక్కులన్ని తీరిపోతాయయ
నందామయ గురుడ నందామయ ఆనందదేవికి నందామయ

No comments: