11 January 2011

నీలాకాశం... నీ నాకోసం...

పల్లవి :
నీలాకాశం... నీ నాకోసం...
జోలలే పాడగా వేడుకే వేడుక
అందమే విల్లుగా బాణమే వేయగా
ప్రేమనే మాయగా తేలెనే ఊహలు
ఇక నువ్వంటు నేనంటు
గిరిగీతలే లేవులే
నీలాకాశం... నీ నాకోసం...

చరణం : 1
నీలోనే నా ఊపిరి నేనంటూ లేనే మరి
నీ పేరు నా పేరునే జోడిస్తే ప్రేమే అది
తీసే శ్వాసే ప్రేమించడం
నీ కోసమే నే జీవించడం
నీది నాది జన్మ బంధం
గుండె గుండె మార్చుకున్నాం
కోరేందుకే మాట మిగిలిందిక
నీ తోడు దొరికిందిగా...
నీలాకాశం... నీ నాకోసం
శ్రీరస్తు శుభమస్తు చిరశాంతి సుఖమస్తు
అందాల బంధానికి

చరణం : 2
ఆరారు కాలాలకు
ఆనందం నీ స్నేహ మే
మండేటి గాయాలను
మాన్పించే మంత్రం నువ్వే
స్వర్గం అంటే ఏవిఁటంటే
నీవున్న చోటే అంటా చెలీ
నిత్యం నన్ను వెన్ను తట్టి
నడిపించు మార్గము నువ్వే మరి
చిరుగాలి పొర కూడా చొరలేదులే
నిను నన్ను విడదీయగా
నీలాకాశం... నీ నాకోసం...

No comments:

                              Other Blogs తెలుగు పద్యాలు|బురిడి|అంబాజిపేట |Technology Tips