28 June 2011

పాదం విడిచి ఎటు పోయెను భువనం

పాదం విడిచి ఎటు పోయెను భువనం
ఆద మరిచి ఎటు వెళ్ళెను గగనం
నింగి నేలపై లేకుండా మనమెక్కడున్నాం
కనుల వెంట పడుతున్నాయి కలలే
మనసు ముంచి వెళుతున్నాయి అలలే
వయసు పొంచి వేస్తుంటే వలలో పడుతున్నాం
హృదయంలో ఆనందాలకు ఉదయాలన్నీ ఉప్పొంగే
మనతోటి చెలిమే చేసి మధురం మురిసెలే
కడతేరని కమ్మని బంధం మన కౌగిలినే కోరిందే
బ్రతికే ఈ క్షణమే…
పాదం విడిచి ఎటు పోయెను భువనం
ఆద మరిచి ఎటు వెళ్ళెను గగనం
నింగి నేలపై లేకుండా మనమెక్కడున్నాం
కనుల వెంట పడుతున్నాయి కలలే
మనసు ముంచి వెళుతున్నాయి అలలే
వయసు పొంచి వేస్తుంటే వలలో పడుతున్నాం

హో.. పయనం ఈ పయనం ఏ నయనం చూపించని వైనం
నిమిషం ఈ నిమిషం నూరేళ్ళకు ప్రాణం
మనతో పరిగెడుతూ తొలి కిరణం ఓడిందీ తరుణం
మనలో ఈ త్వరళం కాలానికి మరణం
మన రెక్కల బలమెంతో చుక్కలకే చూపగలం
మన శృతిలో తేనె గుణం ఆ చేదులో తెప్పించగలం
మన పరుగుల ఒరవడితో దూరాలను తరమగలం
తీరాలను మారగలం
హో.. అన్నీ నిర్లక్ష్యం హో.. సేయటం మన లక్ష్యం
హో.. మన ఉనికే సాక్ష్యం హో.. ఇది మారదులే
మనసంతా మనసంతా సంతోషం సహజం లే
మనకుండవు విభజనలే మన జట్టో త్రిభుజములే
హో.. హృదయంలో ఆనందాలకు ఉదయాలన్నీ ఉప్పొంగే
మనతోటి చెలిమే చేసి మధురం మురిసెలే
కడతేరని కమ్మని బంధం మన కౌగిలినే కోరిందే
బ్రతికే ఈ క్షణమే…
పాదం విడిచి ఎటు పోయెను భువనం
ఆద మరిచి ఎటు వెళ్ళెను గగనం
నింగి నేలపై లేకుండా మనమెక్కడున్నాం
కనుల వెంట పడుతున్నాయి కలలే
మనసు ముంచి వెళుతున్నాయి అలలే
వయసు పొంచి వేస్తుంటే వలలో పడుతున్నాం

No comments: