04 June 2011

ధీర సమీరే యమునా తీరే వసతివనే వనమాలి

ధీర సమీరే యమునా తీరే వసతివనే వనమాలి
గ్రామ సమీపే ప్రేమ కలాపే చెలి తగునా రసకేళి
ఆకాశమే నా హద్దుగా నీ కోసమొచ్చా ముద్దుగా
తెచ్చానురా మెచ్చానురా గిచ్చేయి నచ్చిన సొగసులు

ధీర సమీరే యమునా తీరే వసతివనే వనమాలి
గ్రామ సమీపే ప్రేమ కలాపే చెలి తగునా రసకేళి

వేసంగి మల్లెల్లో శీతంగి వెన్నెల్లో
వేసారిపోతున్నారా రారా
హేమంత మంచుల్లో ఏకాంత మంచంలో
వేటాడుకుంటున్నానే నిన్నే
మొటిమ రగులు సెగలో
తిరగబడి మడమ తగులు వగలో
చిగురు వణుకు చలిలో
మదనుడికి పొగరు పెరిగె పొదలో
గోరింట పొద్దుల్లోన పేరంటాలే ఆడే వేళ

లేలేత నీ అందం నా గీత గోవిందం
నా రాధ నీవేలేవే రావే
నీ గిల్లికజ్జాలు జాబిల్లి వెచ్చాలు
నా ఉట్టి కొట్టేస్తున్నా రావా
వయసు తెలిసె ఒడిలో
యద కరిగి తపన పెరుగు తడిలో
మనువు కుదిరె మదిలో
ఇంకిపుడు చనువు ముదురు గదిలో
వాలారు సందెల్లోన వయ్యారాలే తాకే వేళ

No comments: