04 June 2011

పాటల్లో పాడలేనిదీ నోటి మాటల్లో చెప్పలేనిదీ

పాటల్లో పాడలేనిదీ నోటి మాటల్లో చెప్పలేనిదీ
నీ గుండెల్లో నిండి వున్నదీ ఈ బండల్లో పలుకుతున్నదీ ||2||
నీ ఆర్టు చూసి హార్టు బీటు రూటు మార్చి కొట్టుకుంటు
ఆహా ఓహో అంటున్నదీ, అది ఆహా ఓహో అంటున్నదీ

ఈ ఇలలోనా శిలపైన కొలువైనా వాణి
వరవీణ మృదుపాణి వనరుహ లోచను రాణి ||2||

నల్లనయ్యా పిల్లనగ్రోవినూదా వెల్లువై యెద పొంగిపోదా ||2||
పాట వింటూ లోకమంతా రాతి బొమ్మై నిలిచిపోదా (2)
నల్లనయ్యా

అందమైన సుందరాంగులూ యెందరికో నెలవైన రాణివాసము
ఈ కోటలోన దాగి వున్నదీ నాటీ ప్రేమగాధలెన్నొ కన్నది ||2||

హిస్టరీల మిస్టులోన మిస్టరీని చాటిచెప్పి
ఆహా ఓహో అంటూన్నదీ
అది ఆహా ఓహో అంటూన్నదీ

రాసలీలా రాధహేల ||2||
రసమయమై సాగు వేళా

తరుణుల తనువులు వెన్నెల తరగలుగా ఊగు వేళా
నురుగులు పరుగులుగా సాగే యమునా నది ఆగు వేళ

నింగినేలా వాగూ వంకా చిత్రంగా చిత్తరువాయే ||2||

నల్లనయ్యా పిల్లనగ్రోవినూదా వెల్లువై యెద పొంగిపోదా
లా లా లా లా లా

No comments: