04 June 2011

ఔనా నిజమేనా

ఔనా నిజమేనా
ఔనా నిజమేనా
మరతునన్న మరవలేని మమతలన్ని కలలేనా
రాణివాసమేగేవా బావ మాట మరచేవా
ఔనా నిజమేనా

ఔనా

మనసులోనా మరులు గొలిపి కడకు మాయమాయేనా
ప్రాణమున్న మల్లి పోయి రాతి బొమ్మ మిగిలేనా
ఔనా నిజమేనా

ఔనా

ఔనా కలలేనా
ఔనా కలలేనా
నాటి కథలు వ్యధలేనా, నీటి పైని అలలేనా
బావ నాకు కరువేనా, బ్రతుకు యింక బరువేనా
ఔనా కలలేనా

పగలు లేని రేయి వోలే, పలుకలేని రాయి వోలే
బరువు బ్రతుకు మిగిలేనా, వలపులన్నీ కలలేనా
ఔనా కలలేనా

ఔనాకలలేనా

No comments:

                              Other Blogs తెలుగు పద్యాలు|బురిడి|అంబాజిపేట |Technology Tips