04 June 2011

నల్ల నల్లని మబ్బులోనా లగ్గో పిల్లా

నల్ల నల్లని మబ్బులోనా లగ్గో పిల్లా
తెల్ల తెల్ల చందమామ లగ్గో పిల్ల ||2||

కొప్పూలోన మల్లెపూవులు ఘుమఘుమ లాడుతుంటే
చేతినున్న చిట్టి గాజులు ఘల్లు ఘల్లు మంటుంటే
అబ్బబ్బాహబ్బబ్బా నా వళ్ళు ఝల్లుమంటున్నాదే

నల్లా నల్లని మబ్బుల్లోనా లగ్గో పిల్ల
తెల్లా తెల్లని చందమామ లగ్గో పిల్ల

మంచినీళ్ళ బావి కాడ లగ్గో మావా
మాటా మాటా కలిసిందే లగ్గో మావా ||2||

సింగపూరు రంగు సీర మెహమను ఇస్తవా
లక్కవరం తిరనళ్ళో ముక్కెర కొని ఇస్తావా
కాపవరం సంత నుంచి,
కాపవరం సంత నుంచీ కడియాలు తెస్తావా

మంచి నీళ్ళ బావి కాడా లగ్గో మావా
మాటా మాటా కలిసిందే లగ్గో మావ

మొవ్వాకు చీర పెడతా ముక్కు మీదఊముక్కు మీద ముద్దెడతాఏయ్
మొవ్వాకు చీర పెడతా ముక్కు మీద ముద్దెడతా
కాపవరం వోటలు కాడా కాఫీ నీలు తాపిస్తా
దొరగారు సయ్యంటే సరదాలు తీరుస్తా

ఛీ పో! నీ దొర పేరు వింటూ ఉంటే ఒళ్ళుమంటా
సరదాలు సరసాలు వద్దు పొమ్మంటా
ఛీ ఛీ ఫో! నీ దొర పేరు వింటూ ఉంటే ఒళ్ళుమంటా
సరదాలు సరసాలు వద్దు పొమ్మంటా

నువ్వే నా దొరవంటా
నిన్నే కళ్ళకద్దుకుంటా

అల్లా అల్లా నువ్వంటే సిగ్గో పిల్లా
ఇల్లా ఇల్లా ఎత్తుకుంటా లగ్గో పిల్లా
ఓసి లగ్గో పిల్లా ఓహో లగ్గో పిల్ల

No comments:

                              Other Blogs తెలుగు పద్యాలు|బురిడి|అంబాజిపేట |Technology Tips