22 June 2010

మేలుకోరాదా... కృష్ణా.. మేలుకోరాదా...

మేలుకోరాదా... కృష్ణా.. మేలుకోరాదా...
నలుగురి మేలు కోరే వాడా...మమ్మేలుకోవేరా...

||మేలుకోరాదా||

జేబుదొంగలు లేచారు దొరబాబు దొంగలు లేచారు
తడిగుడ్డలతో గొంతులు కోసే దగాకోరులు లేచారు. ||జేబు||
బడా చోరులూ లేచారూ..
ఎవడి దవడ నీ చేతి చలవతో ఎన్ని తునకలు కానుందో...
ఏ జైలు నీ రాక కోసమై ఎంతగా ఎదురు చూస్తుందో.. ||ఎవడి||
ఎన్నికళ్ళతో చూస్తుందో...

||మేలుకోరాదా||

మేలుకునే ఉన్నాం హమేషా మేలుకునే ఉంటాం..
నలుగురి మేలు కోసం రేతిరి కూడా మేలుకునే ఉంటాం
ఖబడ్దార్.. ||మేలుకునే||

ఉన్నోడికేమో తిన్నదరగదూ...లేనోడికాతిండే దొరకదు...
ధర్మానికేమొ మొద్దు నిద్దరా... దేవుడికా తీరికేది రా..
అందుకే మనం పుట్టాం తొడ గొట్టాం ||2||

అన్యాయాన్ని చావబాదె డ్యూటీ చేపట్టాం....

No comments: