01 June 2010

స౦ధ్యారాగపు సరిగమలో తొలి కలయికలో

స౦ధ్యారాగపు సరిగమలో తొలి కలయికలో
సాయ౦కాలపు చలి చలి ఊహల పక పక లో
డోరేమి రాగల జోరేమి
దాచారా నా ప్రేమ నీ మీద శృతి కలిసిన
స౦ధ్యారాగపు సరిగమలో తొలి కలయికలో
సాయ౦కాలపు చలి చలి ఊహల పక పక లో

చినుకు చినుకు నడుములో చిలక ఉలికి పడెనులే
కవుల కనుల నడుమలో కలల సుడులు తిరిగెలే
పెదవి పెదవి తడుపులో వలపు మధువు తొణికెలే
తనువు తనువు కుదుపు లో తమకమొకటి మెరిసెలే
స౦ధ్యలో తారలాగ స్వప్నమైపోకుమా
కన్నెలోసోయగాలు కందిపోనీ తపమా
హంసలా హాయిగాఆమని రేయిలా వాలిపో ప్రియా
|| స౦ధ్యారాగపు సరిగమలో ||
ఎదుట పడిన బిడియమే చెమట నుదుట చిలికెలే
వణుకు తొణుకు పరువమే వడికి వయసు కలిపెలే
వలపు పొడుపు కధలలో... చిలిపి ముడులు విడెనులే
మరుల విరుల పొదలలొ.. వరుడి పురుడు జరిగెలే
తేనెలే దోచుకెల్లె తుమ్మెదైపోకుమా
గాలికె గంధమిచ్చే కౌగిలింత దూరమా
మాటలా కోటలో పల్లవే ప్రేమగా పాడుకో ప్రియా
|| సంధ్యరాగపు సరిగమలొ ||

No comments: