01 November 2011

మారాలి మారాలి మనుషుల నడవడి మారాలి

మారాలి మారాలి మనుషుల నడవడి మారాలి
మారాలి మారాలి మనుషుల నడవడి మారాలి
మారాలి మారాలి మనుషుల నడవడి మారాలి
తరతరాలుగా మారని వాళ్లను మీ తరమైనా మార్చాలి

మారాలి మారాలి మనుషుల గారడి మారాలి
మారాలి మారాలి మనుషుల గారడి మారాలి
మెప్పుల కోసం చెప్పేవాళ్లను మీ తరమైనా మార్చాలి
మారాలి మారాలి మనుషుల గారడి మారాలి

అందరు దేవుని సంతతి కాదా ఎందుకు తరతమ భేదాలు
అందరు దేవుని సంతతి కాదా ఎందుకు తరతమ భేదాలు
అందరి దేవుడు ఒకడే ఐతే
అందరి దేవుడు ఒకడే ఐతే ఎందుకు కోటి రూపాలు

అందరి రక్తం ఒకటే కాదా ఎందుకు కులమత భేదాలు
అందరి రక్తం ఒకటే అయితే
అందరి రక్తం ఒకటే అయితే ఎందుకు రంగుల తేడాలు
మారాలి మారాలి మనుషుల గారడి మారాలి
మారాలి మారాలి మనుషుల నడవడి మారాలి

తెలిసి తెలిసి బురద నీటిలో ఎవరైనా దిగుతారా
ఆ బురదలోనే అందాల కమలము పుడుతుందని మరిచేరా

కమలం కోసం బురదలోనే కాపురముండేదెవరు
మనసులోని బురద కడుగుకొని మనుషుల్లా బతికేవారు
సమధర్మం చాటేవారు సమధర్మం చాటేవారు
వారిదే ఈనాటి తరం వారిదే రానున్న యుగం
వారిదే ఈనాటి తరం వారిదే రానున్న యుగం
కాదనే వారు ఇంకా కళ్లు తెరవనివారు
మేలుకోక తప్పదులే మేలుకోక తప్పదులే
మారిపోక తప్పదులే తప్పదులే

మారాలి మారాలి మనుషుల నడవడి మారాలి
మారాలి మారాలి మనుషుల నడవడి మారాలి
తరతరాలుగా మారనివాళ్లను మీ తరమైనా మార్చాలి
మారాలి మారాలి మనుషుల నడవడి మారాలి

No comments:

                              Other Blogs తెలుగు పద్యాలు|బురిడి|అంబాజిపేట |Technology Tips